రష్యా రూపొందించిన ఒకే డోసు 'స్పుత్నిక్ లైట్' కరోనా టీకాపై భారత్లో పరీక్షలు జరుపుతామని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. అయితే దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉందని పేర్కొన్నారు.
"రష్యా అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్ వి' టీకాను మూడు వారాల వ్యవధిలో రెండు డోసులు తీసుకునేలా అభివృద్ధి చేశారు. ఆ టీకా మొదటి డోసు తీసుకున్నప్పటి యాంటిజెన్లు, రెండో డోసు తీసుకున్న తర్వాత యాంటీజెన్లు విభిన్నంగా ఉన్నాయి. ఇది ఆ టీకాకు ఉన్న ప్రత్యేకమైన లక్షణం. 'స్పుత్నిక్ లైట్' టీకా విషయంలో ఒకే డోసు తీసుకుంటే సరిపోతుందని తయారీదారులు చెబుతున్నారు. దీనిపై భారత్లో మేం పరీక్షలు జరుపుతాం. అయితే.. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
-వీకే పాల్, నీతి ఆయోగ్ సభ్యుడు