భారత ప్రధాని నరేంద్ర మోదీ, వియత్నాం ప్రధాని నుగుయెన్ జువాన్ ఫుక్తో వర్చువల్గా సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం దిశగా కీలక చర్చలు జరపనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ భేటీ భాగంగా.. ఇరు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, ఆరోగ్య సంరక్షణ ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు వెల్లడించాయి.
ఈ సదస్సులో ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంత అభివృద్ధి పరిస్థితిపై చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇరు దేశాలు స్వేచ్ఛాయుతమైన, బహిరంగ, శాంతియుత, సంపన్నమైన నియమాల ఆధారిత ప్రాంతీయ అభివృద్ధిపై ఆసక్తిని చూపుతున్నాయి.