దేశంలో ఇప్పటివరకు 80 శాతం మంది అర్హులైన వయోజనులకు కరోనా టీకా రెండు డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న రెండు కోట్ల మందికి రెండు డోసులు పూర్తి చేసినట్లు చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీని యువతరం తదుపరి దశకు తీసుకెళ్లినట్లు కేంద్రమంత్రి హర్షం వ్యక్తం చేశారు. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న వారిలో 70 శాతం మందికి ఒక డోసు పూర్తి చేసినట్లు ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 174 కోట్ల 64 లక్షల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత
రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో అన్ని పట్టణ ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేయాలని ఒడిశా సర్కారు నిర్ణయించింది. దీనిని శుక్రవారమే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది.