దేశంలో టీకా పంపిణీ నెలనెలా శరవేగంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. జులై నెలలో 13.45 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అంటే సగటున రోజుకు 43.41లక్షల మందికి టీకాలు వేశామని కేంద్రమంత్రి ట్విటర్‌లో పేర్కొన్నారు.
"కొవిడ్‌పై పోరులో భారత్ రోజురోజుకీ మరింత బలంగా తయారవుతోంది. ప్రతి నెలా వ్యాక్సినేషన్ వేగంగా పెరుగుతోంది. జులైలో సగటున రోజుకు 43.41లక్షల మందికి డోసులకు అందించగా.. మొత్తంగా ఆ నెలలో 13.45 కోట్ల డోసులు అందించాం" అని మాండవీయ తెలిపారు.