ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల బంధాన్ని బలోపేతం చేయడం సహా.. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు భారత్, అమెరికా అంగీకరించాయి. ఈ మేరకు అమెరికా వాణిజ్య రాయబారి క్యాథరిన్ థాయ్తో, భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వీడియో కాల్ సంభాషణ.. ఫలప్రదంగా జరిగిందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
"చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు భారత్, అమెరికా అంగీకరించాయి. పారదర్శకత, సులభతర వాణిజ్యం సూత్రాలకు అనుగుణంగా.. ఆర్థిక భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేసే అంశంపై ఇరు దేశాల నేతలు చర్చించారు."
-వాణిజ్య మంత్రిత్వ శాఖ.