దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను 'చీకటి రోజులు'గా అభివర్ణిస్తూ ప్రధాని మోదీ చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నరేంద్ర మోదీ పాలనలో గత ఏడేళ్లుగా దేశంలో వ్యవస్థలన్నీ ధ్వంసమయ్యాయని, ప్రజాస్వామ్య పునాదులు బలహీనపడ్డాయని కాంగ్రెస్ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా విమర్శించారు.
వాటికి మారుపేరు ప్రధాని..
అణచివేత(సప్రెస్), నిర్మూలన(స్టిఫిల్), లోబరుచుకోవటం(సబ్జుగేట్)లకు మారుపేరుగా నిలిచిన ప్రధాని.. అంటూ సుర్జేవాలా దుయ్యబట్టారు. పార్లమెంట్‌ను నిర్లక్ష్యం చేశారు. రాజ్యాంగాన్ని ఉపేక్షించారు, వ్యవస్థలను ధ్వంసం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు.. అంటూ మండిపడ్డారు.
ఏడేళ్ల మోదీ పాలనలో 'ఎమర్జెన్సీ' సరికొత్త అర్థాన్ని సంతరించుకొని.. 'మోదీ- జెన్సీ'గా మారిందని సుర్జేవాలా పేర్కొన్నారు.
ఇదీ చదవండి :ఆ ఒక్క పనితో 'రాజకీయ లెక్కలు' తారుమారు.. కానీ!