India Rains 2022:భారత వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ వానాకాలంలో భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముందుగా అంచనా వేసినదానికంటే అధికంగానే వానలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర తెలిపారు. దీర్ఘకాలం సగటుకు 103 శాతం వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఏప్రిల్‌లో దీర్ఘకాల సగటులో 99 శాతం మాత్రమే వానలు పడొచ్చని లెక్కగట్టింది ఐఎండీ. తాజాగా రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్న నేపథ్యంలో అంచనాలను సవరించింది.
More Rains in India:దేశంలోని చాలా వరకు భూభాగంలో వర్షాలు మెరుగ్గా పడతాయని మోహపాత్ర తెలిపారు. ఈ మేరకు ప్రస్తుత సీజన్‌కు సవరించిన అంచనాల గణాంకాలను వెలువరించారు. మధ్య, ద్వీపకల్ప భారతదేశంలో దీర్ఘకాలంలో సగటుకు 106 శాతం వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.
Monsoon in Kerala 2022:ఇప్పటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా జూన్ 1న కేరళకు రావాల్సిన నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే వచ్చేశాయి. ఇప్పటికే కేరళలో వర్షాలు ప్రారంభయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.