India to ban 54 more Chinese apps: చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందనే కారణంతో 54 చైనా యాప్‌లపై నిషేధం విధించనుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
వీటిలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యూటీ కెమెరా, స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ, ఈక్వలైజర్ అండ్ బాస్ బూస్టర్, వివా వీడియో ఎడిటర్, యాప్‌లాక్, డ్యూయల్ స్పేష్ లైట్ వంటివి ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నిషేధించనున్న ప్రముఖ యాప్‌లు ఇవే..!
- స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ
- బ్యూటీ కెమెరా
- సెల్ఫీ కెమెరా
- ఈక్వలైజర్ అండ్ బాస్ బూస్టర్
- క్యామ్‌కార్డ్ ఫర్ సేర్స్ఫోర్స్ ఈఎన్టీ
- ఐలాండ్ 2
- యాషెస్ ఆఫ్ టైమ్ లైట్
- వివా వీడియో ఎడిటర్
- టెన్సెంట్ ఎక్స్‌రివర్
- ఆన్‌మియోజీ చెస్
- ఆన్‌మియోజీ అరేనా
- యాప్‌లాక్
- డ్యూయల్ స్పేస్ లైట్