SFDR Launch Success: భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) చేసిన సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్(SFDR) బూస్టర్ క్షిపణి సాంకేతిక పరీక్ష విజయవంతమైంది. ఒడిశా చాందీపుర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సెంటర్ నుంచి పరీక్షించినట్లు డీఆర్‌డీవో వెల్లడించింది. క్షిపణి వ్యవస్థలోని అన్ని పరికరాలు నిర్విఘ్నంగా పనిచేసినట్లు చెప్పింది. టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థ ఇచ్చిన డేటా ఆధారంగా పరీక్ష విజయవంతమైనట్లు తేల్చారు.
బూస్టర్ క్షిపణి పరీక్ష సక్సెస్.. శత్రు యుద్ధవిమానాలకు చుక్కలే! - DRDO news
SFDR Launch Success: సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్‌జెట్ (SFDR) బూస్టర్ క్షిపణి సాంకేతిక పరీక్ష విజయవంతమైందని భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శుక్రవారం వెల్లడించింది. ఈ పరీక్షను ఒడిశా తీరంలోని చాందీపుర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి నిర్వహించినట్లు తెలిపింది.
సూపర్ సోనిక్ వేగంతో శత్రు దేశాల వైమానిక దాడులను.. క్షిపణి వ్యవస్థ అడ్డుకోగలదని డీఆర్‌డీవో పేర్కొంది. క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. క్షిపణి సాంకేతికత అభివృద్ధిలో దీనినో కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఈ క్షిపణిని హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ, హైదరాబాద్‌లోని ఆర్సీఐ, పుణెలోని హెచ్ఈఎంఆర్ఎల్ వంటి ఇతర డీఆర్‌డీవో ల్యాబొరేటరీల సహకారంతో అభివృద్ధి చేశారు.
ఇదీ చదవండి: రూ.2కే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు కోచింగ్