'అగ్ని-ప్రైమ్' అనే క్షిపణిని రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరం నుంచి సోమవారం ఉదయం 10.55గంటలకు చేపట్టిన ఈ క్షిపణి ప్రయోగం విజయవంతమైనట్లు రక్షణ శాఖ ప్రకటించింది. అన్ని రకాల ఇంధన సామర్థ్యంతో ఈ క్షిపణిని రూపొందించినట్లు తెలిపింది.
'అగ్ని-ప్రైమ్' క్షిపణి ప్రయోగం విజయవంతం - అగ్ని క్షిపణిపై రక్షణ శాఖ ప్రకటన
'అగ్ని-ప్రైమ్' క్షిపణిని రక్షణ శాఖ విజయవంతంగా పరీక్షించింది. అన్ని రకాల ఇంధనాలతో పనిచేసే సామర్థ్యంతో ఈ క్షిపణిని రూపొందించినట్లు తెలిపింది.
'అగ్ని-ప్రైమ్' క్షిపణి ప్రయోగం విజయవంతం
తూర్పు తీరం వెంబడి ఉన్న వివిధ టెలిమెట్రీ, రాడార్ స్టేషన్లు క్షిపణి ప్రయోగాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించినట్లు రక్షణ శాఖ ప్రకటించింది. అనుకున్న లక్ష్యాలను ఖచ్చితత్వంతో (గరిష్ఠంగా) చేరకుందని అధికారులు పేర్కొన్నారు. అగ్ని క్షిపణి సిరీస్లో కొత్త తరానికి చెందిన అగ్ని-ప్రైమ్ 1000-2000 కిలోమీటర్ల మధ్య శ్రేణి సామర్థ్యంతో దూసుకెళ్లనుంది.
ఇవీ చదవండి:'యాంటీ ట్యాంక్ గైడెడ్' క్షిపణుల కొనుగోలుకు ఒప్పందం
Last Updated : Jun 28, 2021, 12:48 PM IST