బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా కొత్త రకం వైరస్‌ను భారత్‌లోని ప్రయోగశాలల్లో విజయవంతంగా వృద్ధిచేసినట్లు భారత వైద్య పరశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశమూ సార్స్‌కోవ్-2 బ్రిటన్ రకాన్ని(వేరియంట్) వేరుచేయలేదని, వృద్ధి చేయలేదని ఐసీఎంఆర్ ట్వీట్టర్ వేదికగా వెల్లడించింది.
'విజయవంతంగా కరోనా కొత్త వైరస్ వృద్ధి' - ఐసీఎంఆర్
కరోనా కొత్త రకం వైరస్‌ను దేశ ప్రయోగశాలల్లో వృద్ధిచేయడానికి తలపెట్టిన ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇది ప్రపంచంలోనే తొలిసారి అని పేర్కొంది.
!['విజయవంతంగా కరోనా కొత్త వైరస్ వృద్ధి' India successfully cultures UK-variant of Sars-CoV-2: ICMR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10097802-585-10097802-1609602519659.jpg)
కరోనా కొత్త వైరస్ వృద్ధి సక్సెస్: ఐసీఎంఆర్
"బ్రిటన్ నుంచి భారత్‌కు తిరిగివచ్చిన వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా జాతీయ వైరాలజీ సంస్థలో కొత్త వైరస్‌ను విజయవంతంగా వేరు చేశాం. వృద్ధి చేశాం," అని వివరించింది ఐసీఎంఆర్. ఇందుకోసం ఐసీఎంఆర్-ఎన్ఐవీ శాస్త్రవేత్తలు వెరో సెల్లైన్స్ని ఉపయోగించినట్లు తెలిపింది.
ఇదీ చూడండి:-7 నెలల తర్వాత దిల్లీలో అతి తక్కువ కేసులు