తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 2 స్థానాల దిగువకు భారత్​ - ఐక్యరాజ్య సమితి

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి భారత్ రెండు స్థానాలు కిందకు దిగజారింది. గతేడాది 115వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 117కు పడిపోయినట్లు ద స్టేట్ ఆఫ్ ఇండియాప్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్-2021 పేర్కొంది.

Sustainable Development Goals
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు

By

Published : Jun 7, 2021, 5:10 AM IST

2030 ఎజెండాతో ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను(ఎస్‌డీజీ) చేరుకోవడంలో భారత్‌ ఈ ఏడాది కాస్త వెనుకబడింది. గత ఏడాదితో పోలిస్తే రెండు స్థానాలు దిగజారి 117కు పడిపోయింది.

ఆకలి ఇబ్బందులను సమర్థంగా పరిష్కరించి ఆహార భద్రతను కల్పించడం(ఎస్‌డీజీ2), లింగసమానత్వ సాధన(ఎస్‌డీజీ5), పటిష్ఠ మౌలిక వసతుల నిర్మాణం; సమగ్ర, స్థిరమైన పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం; ఆవిష్కరణల ప్రోత్సాహం(ఎస్‌డీజీ9) వంటి లక్ష్యాలను ఎదుర్కోవడంలో భారత్‌ సవాళ్లను ఎదుర్కొంటోందని అందుకే భారత స్థానం ఈసారి కిందకు దిగజారిందని 'స్టేట్‌ ఆఫ్‌ ఇండియాస్‌ ఎన్విరాన్‌మెంట్‌ రిపోర్ట్‌ 2021' పేర్కొంది.

117వ స్థానంలో..

ఈ లక్ష్యాలను చేరుకోవడంలో పురోగతి సాధిస్తున్న సాధిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ 61.9/100 స్కోర్‌తో 117వ స్థానంలో ఉండగా.. దక్షిణాసియా దేశాలైన భూటాన్‌, నేపాల్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ మన కంటే మెరుగైన స్థానంలో ఉండడం గమనార్హం. రాష్ట్రాలవారీగా చూస్తే 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో ఝార్ఖండ్‌, బిహార్‌ వెనుబడ్డాయని నివేదిక తెలిపింది. ఝార్ఖండ్‌ ఐదు ఎస్‌డీజీల్లో, బిహార్‌ ఏడింటిలో వెనుబడినట్లు పేర్కొంది. ఇక కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌, చండీగఢ్‌ లక్ష్యాలను చేరుకోవడంలో ముందు వరుసలో ఉన్నట్లు తెలిపిది.

పారిశుద్ధ్యం, తాగునీరు, పర్యావరణ సేవలు, జీవవైవిధ్యం, వాయు కాలుష్యం, ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ వంటి అంశాల ఆధారంగా రూపొందించే ఎన్విరాన్‌మెంట్‌ పర్ఫార్మెన్స్‌ ఇండెక్స్‌(ఈపీఐ)లో భారత ర్యాంకు 168గా నిలిచింది. ఇక దేశ జనాభాను ప్రభుత్వాలు పర్యావరణ సంబంధిత ఆరోగ్య ముప్పు నుంచి కాపాడుతున్న తీరును బట్టి నిర్ధరించే జాబితాలో భారత్‌ 172వ స్థానానికి పరిమితమైంది.

ఇదీ చదవండి :'రేషన్​ డోర్​ డెలివరీ స్కీమ్​ కాదు.. పెద్ద స్కామ్​'

ABOUT THE AUTHOR

...view details