అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓటమి నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని శివసేన అభిప్రాయపడింది. ఈ ఫలితాలను బిహార్ ఎన్నికలతో పోలుస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమెరికా తరహా ఫలితమే వస్తుందని తమ అధికారిక పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది.
"అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ ఎప్పుడూ అర్హుడు కారు. నాలుగేళ్ల క్రితం చేసిన తప్పిదాన్ని అమెరికన్లు ఇప్పుడు సరిదిద్దుకున్నారు. ఈ నాలుగేళ్లలో ట్రంప్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అందుకే ఆయనను గద్దె దించారు. ట్రంప్ ఓటమి నుంచి మనం పాఠాలు నేర్చుకుంటే బాగుంటుంది. ఏదేమైనా అమెరికాలో అధికార మార్పు జరిగింది.
బిహార్‌లో కూడా అదే జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ఓడిపోతుందని స్పష్టమవుతోంది. పోల్ సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మేము తప్ప ప్రజలకు మరో ప్రత్యామ్నాయం లేదు.. అని భ్రమలో ఉన్న నాయకుల్ని తొలగించేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. తేజస్వీ యాదవ్ లాంటి యువనేత ముందు మోదీ, నితీశ్ కుమార్ లాంటివారు కూడా నిలువలేరు."