తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తాలిబన్ల విషయంలో వేచి చూసే ధోరణే భారత్​కు ఉత్తమం' - నట్వార్​ సింగ్​ ఇంటర్వ్యూ

అఫ్గానిస్థాన్​ను ఆక్రమించిన తాలిబన్లతో దౌత్య సంబంధాలపై కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి భారత్​కు వేచి చూసే ధోరణి ఉత్తమమని పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్​పై తాలిబన్లు ఆధిపత్యం సాధించక ముందే భారత్ వారిని అధికారికంగా గుర్తించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Natwar Singh
నట్వర్ సింగ్

By

Published : Aug 19, 2021, 5:10 AM IST

Updated : Aug 19, 2021, 9:07 AM IST

అఫ్గానిస్థాన్​పై తాలిబన్లు ఆధిపత్యం సాధించక ముందే భారత్ వారిని అధికారికంగా గుర్తించి ఉంటే బాగుండేదని విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి కె.నట్వర్ సింగ్(92) అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి వేచి చూసే ధోరణి మనకు ఉత్తమమని, బాధ్యతాయుత పాలకులుగా తాలిబన్లు నిరూపించుకుంటే అఫ్గాన్​తో దౌత్యపరమైన సంబంధాలు పెట్టుకోవచ్చని తెలిపారు. అయినా 20 ఏళ్ల కిందట అధికారంలో ఉన్నప్పటికీ, ఇప్పటికీ తాలిబన్ల వైఖరిలో గణనీయమైన మార్పు కనిపిస్తోందన్నారు.

యూపీఏ-1 హయాంలో విదేశీ వ్యవహారాలశాఖ మంత్రిగా పనిచేసిన నట్వర్ సింగ్ పాకిస్థాన్‌కు భారత రాయబారిగా కూడా వ్యవహరించారు. దౌత్య వ్యవహారాలపరంగా విశేషానుభవం ఉన్న ఈ సీనియర్ నేత అఫ్గాన్ పరిణామాలపై బుధవారం పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'ఒకవేళ నేనే విదేశాంగ మంత్రిగా ఉండి ఉంటే.. నా పరిధులు దాటి, నేను తాలిబన్లతో మాట్లాడేవాడిని' అని నట్వర్ సింగ్ తెలిపారు.

Last Updated : Aug 19, 2021, 9:07 AM IST

ABOUT THE AUTHOR

...view details