India Russia arms deal: భారత్- రష్యా మైత్రిలో మరో ముందడుగు పడింది. ఆరు లక్షల ఏకే-203 రైఫిల్స్‌ను సంయుక్తంగా తయారు చేసేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉత్తర్‌ప్రదేశ్ అమేఠీలో వీటిని తయారు చేయనున్నారు.
ఐఆర్ఐజీసీఎమ్-ఎమ్టీసీ(ఇండియా-రష్యా ఇంటర్ గవర్న్మెంటల్ కమిషన్ ఆన్ మిలిటరీ అండ్ మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్) 20వ సమావేశంలో మొత్తం నాలుగు ఒప్పందాలు కుదిరాయి. రైఫిల్స్ తయారీతో పాటు రానున్న 10ఏళ్లు రక్షణ సహకారంపైనా ఇరు దేశాలు ఒప్పందాల్ని చేసుకున్నాయి. భేటీలో పాల్గొన్న భారత్, రష్యా రక్షణ శాఖ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జెనరల్ సెర్గే షోయిగు.. ఇరు దేశాల వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరిపారు.