తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రష్యా అధ్యక్షుడు పుతిన్​తో మోదీ భేటీ - భారత్, రష్యా సంబంధాలు

india russia 21st summit
భారత్ రష్యా సమావేశం

By

Published : Dec 6, 2021, 11:12 AM IST

Updated : Dec 6, 2021, 6:15 PM IST

18:14 December 06

రష్యా అధ్యక్షుడు పుతిన్​తో మోదీ భేటీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో దిల్లీలోని హైదరాబాద్​ హౌస్​లో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. " కొవిడ్​-19 ద్వారా ఎదురైన సవాళ్లు మినహా.. భారత్​-రష్యా సంబంధాల వృద్ధిలో ఎలాంటి మార్పు లేదు. మన ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతోంది." అని పేర్కొన్నారు మోదీ.

18:07 December 06

రష్యా అధ్యక్షుడు పుతిన్​కు స్వాగతం పలికిన మోదీ

భారత పర్యటనలో భాగంగా దిల్లీ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​కు స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దిల్లీలోని హైదరాబాద్​ హౌస్​లో ఆయనను కలిశారు.

ఇరువురు నేతలు 21వ ఇండియా-రష్యా వార్షిక సదస్సులో పాల్గొననున్నారు.

15:30 December 06

ఆరు లక్షల ఏకే-203 రైఫిల్స్ తయారీ కోసం భారత్​- రష్యా డీల్

India Russia arms deal: భారత్​- రష్యా మైత్రిలో మరో ముందడుగు పడింది. ఆరు లక్షల ఏకే-203 రైఫిల్స్​ను సంయుక్తంగా తయారు చేసేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉత్తర్​ప్రదేశ్​ అమేఠీలో వీటిని తయారు చేయనున్నారు.

ఐఆర్​ఐజీసీఎమ్​-ఎమ్​టీసీ(ఇండియా-రష్యా ఇంటర్​ గవర్న్​మెంటల్​ కమిషన్​ ఆన్​ మిలిటరీ అండ్​ మిలిటరీ టెక్నికల్​ కోఆపరేషన్​) 20వ సమావేశంలో మొత్తం నాలుగు ఒప్పందాలు కుదిరాయి. రైఫిల్స్​ తయారీతో పాటు రానున్న 10ఏళ్లు రక్షణ సహకారంపైనా ఇరు దేశాలు ఒప్పందాల్ని చేసుకున్నాయి. భేటీలో పాల్గొన్న భారత్​, రష్యా రక్షణ శాఖ మంత్రులు రాజ్​నాథ్​ సింగ్​, జెనరల్​ సెర్గే షోయిగు.. ఇరు దేశాల వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా రాజ్​నాథ్​ మాట్లాడుతూ.. "రష్యాతో భారత్​కు సుదీర్ఘ కాలంగా వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. కాలంతో పాటు ఎదురైన పరీక్షలు, సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగాయి. భారత్​కు సహకారం అందించిన రష్యాకు అభినందనలు. అయితే ఒక దేశంతో బంధాన్ని బలోపేతం చేసుకోవడం అంటే.. మరో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు కాదన్న విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి," అని అన్నారు. తాజా పరిస్థితులతో ఆసియాలో శాంతి, స్థిరత్వం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

12:28 December 06

భారత్​, రష్యా సంబంధాల్లో ఇది చారిత్రక రోజుని రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్ తెలిపారు. కొవిడ్-19, సరిహద్దుల్లో ఉద్రిక్తత.. సవాళ్లను ఎదుర్కొన్నామన్నారు. దృఢమైన రాజకీయ సంకల్పం, సమర్థతతో సవాళ్లు అధిగమించామని తెలిపారు.

తమ అంచనాలు, అవసరాలకు సరిపోయే దేశాలతోనే భారత్ మైత్రి కోరుకుంటుందన్నారు రాజ్​నాథ్. ఈ మధ్యకాలంలో భారత్, రష్యా సంబంధాలు మరింత బలపడ్డాయన్నారు.

11:41 December 06

సైనిక సామాగ్రి ఉత్పత్తిపై చర్చ..

రష్యా రక్షణమంత్రి జనరల్ షెర్గీ సోకూతో రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సైనిక సామగ్రి ఉత్పత్తి.. తదితర అంశాలపై చర్చించారు. పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు.

భారత్​, రష్యాల మధ్య.. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, విద్యుత్తు, సాంకేతికత.. తదితర అంశాలపై కీలక ఒప్పందాలు చేయనున్నారు. అంతేకాక అఫ్గానిస్థాన్​ పరిస్థితులపైనా చర్చించే అవకాశం ఉంది.

11:22 December 06

రష్యా విదేశాంగమంత్రితో జైశంకర్​ భేటీ..

2+2 సమావేశానికి ముందు విదేశాంగమంత్రి జైశంకర్​తో రష్యా విదేశాంగమంత్రి సర్గీ లావ్రో సమావేశమయ్యారు. భారత్​, రష్యా సంబంధాలు ప్రత్యేకమైనవని సమావేశంలో జైశంకర్​ తెలిపారు. ఈ చర్చలు ఇరుదేశాలకు లాభదాయకమవుతాయన్నారు. రెండేళ్ల తర్వాత భారత్, రష్యా వార్షిక సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు సమావేశంలో ద్వైపాక్షిక సమావేశం మాత్రమేకాక, ప్రపంచపరిస్థితులపైనా చర్చించనున్నట్లు వివరించారు.

11:04 December 06

2+2 సమావేశానికి ముందు భారత్​, రష్యా మంత్రుల భేటీ

భారత్, రష్యాల మధ్య 21వ వార్షిక సమావేశానికి ముందు రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​తో దిల్లీలోని సుస్మాస్వరాజ్​ భవన్​లో రష్యా రక్షణ మంత్రి సర్జీ సీగో భేటీ అయ్యారు. రక్షణ రంగంలోని వివిధ అంశాలపై చర్చించారు.

10:46 December 06

రష్యా అధ్యక్షుడు పుతిన్​తో మోదీ భేటీ

india russia 2+2 dialogue: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక్కరోజు పర్యటనలో భాగంగా నేడు భారత్​కు రానున్నారు.​ భారత ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్​ మధ్య ద్వైపాక్షిక సదస్సు జరగనుంది. సాయంత్రం జరగనున్న ఈ భేటీలో ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు కీలక రంగాల్లో ఒప్పందాలు కుదరనున్నాయి.

Last Updated : Dec 6, 2021, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details