Corona Cases In India: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. మరో 3,303 మందికి పాజిటివ్‌గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,563 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 68వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 23వేలకు పైగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.66 శాతానికి పైగా ఉంది.
- యాక్టివ్ కేసులు: 16,980
- మొత్తం మరణాలు: 523693
- మొత్తం కేసులు: 4,30,68,799
- రికవరీలు: 4,25,28,126
Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. బుధవారం 19,53,437మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,88,40,75,453కు చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజు వ్యవధిలో 6,57,253 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 2,655 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- జర్మనీలో 124,863 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 245 మంది మృతిచెందారు.
- ఇటలీలో 87,940 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 186 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 76,761 కరోనా కేసులు నమోదయ్యాయి. 141 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 67,711 మంది వైరస్ సోకింది. మరో 152 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో 57,738 కరోనా కేసులు బయటపడ్డాయి. 311 మంది వైరస్‌కు బలయ్యారు.
ఇదీ చదవండి:Covid vaccine: ప్రికాషన్ డోస్ వ్యవధి కుదింపు.. ఇక వారూ అర్హులే!