భారత్లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్ కేసులు(Corona Update) భారీగా తగ్గాయి. కొత్తగా 25,072 మంది వైరస్(Covid-19) బారిన పడ్డారు. మరో 389 మంది మరణించారు. మరో 44,157 మంది కరోనాను జయించారు.
మొత్తం కేసులు:3,24,49,306
మొత్తం మరణాలు:4,34,756
కోలుకున్నవారు:3,16,80,626
యాక్టివ్ కేసులు:3,33,924
వ్యాక్సినేషన్
దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ(Vaccination in India) నిర్విరామంగా కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 7,95,543 డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 58,25,49,595 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.
కొవిడ్ పరీక్షలు
ఆదివారం ఒక్కరోజే దేశంలో 12,95,160 కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 50,75,51,399కి చేరినట్లు చెప్పింది.
ప్రపంచంలో కొవిడ్ కేసులు..
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి(Global corona virus update) కొనసాగుతూనే ఉంది. కొత్తగా 4,51,510మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 8,264 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,25,55,062కి చేరగా.. మరణాల సంఖ్య 44,43,904కు పెరిగింది.
కొత్త కేసులు..
- అమెరికా- 30,810
- బ్రెజిల్- 14,404
- ఫ్రాన్స్- 17,300
- బ్రిటన్- 32,253
- రష్యా- 20,564
ఇదీ చూడండి:ఆంక్షల సడలింపు.. ఆ రాష్ట్రంలో స్కూల్స్ రీఓపెన్
ఇదీ చూడండి:Zycov-D Vaccine: సెప్టెంబర్ నుంచి జైకోవ్-డి టీకా!