దేశవ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి మరింత ప్రమాదకరంగా మారుతోంది. కొత్తగా 2 లక్షల 17 వేల 353 కేసులు వెలుగుచూశాయి. మరో 1,185 మంది మహమ్మారికి బలయ్యారు. 1,18,302 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు:1,42,91,917
- మొత్తం మరణాలు:1,74,308
- కోలుకున్నవారు:1,25,47,866
- యాక్టివ్ కేసులు:15,69,743
దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 14 లక్షల 73వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్‌ల సంఖ్య 26 కోట్ల 34 లక్షలు దాటింది.