తెలంగాణ

telangana

ETV Bharat / bharat

201రోజుల తర్వాత 20వేల దిగువకు కరోనా కేసులు - కొవిడ్ వ్యాక్సినేషన్

దేశంలో కరోనా కేసులు (Coronavirus update) 201రోజుల తర్వాత 20వేల దిగువకు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా 18,795 మంది వైరస్​ (Coronavirus India) బారినపడ్డారు. మరో 26,030 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. మరో 179 మంది మృతిచెందారు.

India corona cases
భారత్​లో కరోనా కేసులు

By

Published : Sep 28, 2021, 9:46 AM IST

భారత్​లో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్య (Coronavirus update) భారీగా తగ్గింది. 201రోజుల తర్వాత 20 వేల కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 18,795 మందికి కరోనా పాజిటివ్​గా (Coronavirus India) నిర్ధరణ అయింది. ఒక్కరోజే 26,030 మంది కొవిడ్ (Corona update) నుంచి కోలుకున్నారు. మరో 179 మంది చనిపోయారు.

  • మొత్తం కేసులు: 3,36,97,581
  • మొత్తం మరణాలు: 4,47,373
  • మొత్తం కోలుకున్నవారు: 3,29,58,002
  • యాక్టివ్ కేసులు: 2,92,206

కేరళలో కరోనా కేసులు(Kerala Corona Update) స్థిరంగా తగ్గుముఖం పడుతున్నాయి. అక్కడ కొత్తగా 11,699మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మరో 58మంది మహమ్మారి ధాటికి మృతిచెందారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కొవిడ్​ కేసులు వెలుగుచూస్తున్నాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

టీకాల పంపిణీ..

దేశంలో ఇప్పటివరకు 87,07,08,636 టీకా డోసులను (covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సోమవారం ఒక్కరోజే 1,02,22,525 వ్యాక్సిన్​ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది.

ప్రపంచ దేశాల్లో..

ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా కేసుల సంఖ్య (Global corona virus update) స్వల్పంగా పెరిగింది. తాజాగా 3,71,530 మందికి కొవిడ్​ ​(Corona update) సోకింది. వైరస్​​ ధాటికి మరో 5,351 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,30,99,451కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 47,69,820కు పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికా - 81,409
  • రష్యా - 22,236
  • బ్రిటన్ - 37,960
  • టర్కీ - 27,188
  • ఇరాన్ - 14,470
  • బ్రెజిల్​ - 14,423

ఇదీ చూడండి:ఆరోగ్యానికి డిజిటల్‌ గుర్తింపు సాధ్యమేనా?

ABOUT THE AUTHOR

...view details