భారత్లో కరోనా(Coronavirus India) వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 8,865 మంది వైరస్ బారిన పడినట్లు (Corona cases in India) తేలింది. ఇది 287 రోజుల కనిష్ఠం కావడం గమనార్హం. కరోనా(Coronavirus India) ధాటికి మరో 197 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 11,971 మంది వైరస్ను జయించారు.
- మొత్తం కేసులు:34,456,401
- మొత్తం మరణాలు:4,63,852
- యాక్టివ్ కేసులు:1,30,793
- కోలుకున్నవారు:3,38,61,756
పరీక్షలు
దేశవ్యాప్తంగా సోమవారం ఒక్కరోజే11,07,617 నమూనాలను పరీక్షించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 62,57,74,159కి చేరినట్లు చెప్పింది.