Covid Cases in India Today: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా తగ్గింది. తాజాగా 8,309 మంది కొవిడ్ బారిన పడ్డారు. కరోనా ధాటికి మరో 236 మంది మృతి చెందారు. ఒక్కరోజే 9,905మందికిపైగా వైరస్ నుంచి కోలుకున్నారు. 544 రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్ కేసులు చేరుకున్నాయి.
- మొత్తం కేసులు:3,45,63,284
- మొత్తం మరణాలు:4,68,790
- యాక్టివ్ కేసులు:1,05,691
- మొత్తం కోలుకున్నవారు:3,40,08,183
టీకాల పంపిణీ
ఆదివారం ఒక్కరోజే 42,04,171కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫలితంగా మొత్తం టీకాల పంపిణీ.. 1,22,41,68,929కు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కొవిడ్ కేసుల సంఖ్యలో (coronavirus worldwide) తగ్గుదల నమోదైంది. కొత్తగా 3,89,114 మందికి కరోనా (Corona update) సోకింది. 4,294 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 26,17,48,775కు చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 52,16,961కు పెరిగింది.
వివిధ దేశాల్లో కొత్త కేసులు..
- జర్మనీలో కొత్తగా మరో 38,444 మంది కరోనా బారిన పడ్డారు. 71 మంది ప్రాణాలు కోల్పోయారు..
- బ్రిటన్‌లో మరో 37,681 మందికి వైరస్ సోకింది. మరో 51 మంది మృతి చెందారు.
- అమెరికాలో కొత్తగా 20,835 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో102 మంది మరణించారు.
- రష్యాలో మరో 33,548 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఒక్కరోజే 1,224 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 31,648 మంది మహమ్మారి బారిన పడ్డారు. మరో 23 మంది మరణించారు.
- టర్కీలో కొత్తగా 21,655 కరోనా కేసులు నమోదవగా.. 213మంది ప్రాణాలు కోల్పోయారు.
- పోలాండ్‌లో కొత్తగా 20,576కేసులు, 51మరణాలు నమోదయ్యాయి.