India covid cases: దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 6,358 కేసులు వెలుగుచూశాయి. మరో 293 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,450 మంది కోలుకున్నారు. మరోవైపు, ఒమిక్రాన్ కేసుల సంఖ్య 653కు పెరిగింది.
- మొత్తం కేసులు: 3,47,99,691
- మొత్తం మరణాలు: 4,80,290
- యాక్టివ్ కేసులు: 75456
- కోలుకున్నవారు: 3,42,43,945
Vaccination in India
దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. సోమవారం మరో 72,87,547 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,42,46,81,736కు చేరింది.
Covid world cases
అటు, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు భయపెడుతున్నాయి. ఒక్కరోజే 3,81,872 కేసులు వెలుగులోకి వచ్చాయి. 3,022 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 2.13లక్షల కేసులు నమోదయ్యాయి. 654 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 8,39,429కు పెరిగింది.
- బ్రిటన్‌లో 98వేల కేసులు వెలుగులోకివచ్చాయి. మరో 143మంది వైరస్‌కు బలయ్యారు.
- ఫ్రాన్స్‌లో 30 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 256 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 122,898కు చేరింది.
- ఇటలీలోనూ కరోనా తీవ్రంగానే ఉంది. కొత్తగా 30 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. 142 మంది మృతి చెందారు.
- రష్యాలో కరోనా మరణాల సంఖ్య భారీగానే నమోదవుతోంది. కరోనా తీవ్రతకు మరో 937 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 23 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం మరణాల సంఖ్య 3,05,115కుపైగా చేరుకుంది.
ఇదీ చదవండి:బ్రిటన్‌లో కొవిడ్ పంజా.. తొలిసారి లక్షకుపైగా కేసులు