తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid-19 updates: 62 వేల కొత్త కేసులు.. 1500 మరణాలు - భారత్​లో యాక్టివ్ కేసుల వివరాలు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 62,480 మందికి కొవిడ్ సోకింది. వైరస్​ బారినపడి మరో 1,587 మంది మరణించారు. దేశంలో యాక్టివ్​ కేసుల సంఖ్య 8 లక్షలకు దిగొచ్చింది.

INDIA CORONA CASES
కరోనా కేసులు

By

Published : Jun 18, 2021, 9:48 AM IST

దేశంలో కొవిడ్ ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 62,480 మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మారి ధాటికి మరో 1,587మంది ప్రాణాలు కోల్పోయారు. 88,977మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. గత 73రోజుల్లో దేశంలో 8 లక్షల యాక్టివ్​ కేసులకు తగ్గడం ఇదే తొలిసారి.

  • మొత్తం కేసులు: 2,97,62,793
  • మొత్తం మరణాలు:3,83,490
  • కోలుకున్నవారు: 2,85,80,647
  • యాక్టివ్ కేసులు:7,98,656

వ్యాక్సినేషన్​​:

దేశంలో మొత్తంగా 26,89,60,399 వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇవీ చదవండి:53% కొవిడ్ మరణాలు ఆ 45 రోజుల్లోనే!

'కరోనా మరణాలపై మార్గదర్శకాలు పాటించాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details