దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య పోల్చితే తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 48,698 మంది వైరస్ బారిన పడ్డారు. కాగా, మహమ్మారి ధాటికి మరో 1,183 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 64,818 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు:3,01,83,143
- మొత్తం మరణాలు:3,94,493
- కోలుకున్నవారు:2,91,93,085
- యాక్టివ్ కేసులు:5,95,565
ఇదీ చదవండి :టీకాలు డెల్టాప్లస్ వేరియంట్‌ను అడ్డుకోలేవా?
మొత్తం టెస్టులు..
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 40,18,11,892 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. శుక్రవారం ఒక్కరోజే 17,45,809 మందికి కొవిడ్-19 పరీక్షలు చేసినట్లు పేర్కొంది.