దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Coronavirus Live Updates) క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొత్తగా 42,640 మంది వైరస్ బారిన పడ్డారు. గడిచిన 91 రోజుల్లో ఇవే అత్యల్ప రోజువారీ కేసులు కావడం గమనార్హం.
కాగా,మహమ్మారి ధాటికి మరో 1,167 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి 81,839 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు:2,99,77,861
- మొత్తం మరణాలు:3,89,302
- కోలుకున్నవారు:2,89,26,038
- యాక్టివ్ కేసులు:6,62,521
సోమవారం ఒక్కరోజే 16,64,360 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 39,40,72,142కు చేరింది.