భారత్లో కరోనా మహమ్మారి వ్యాప్తి(Covid in India) క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 41,831 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి మరో 541 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 39,258మంది వైరస్ నుంచి కోలుకోగా రికవరీ రేటు 97.36శాతానికి చేరింది.
- మొత్తం కేసులు:3,16,55,824
- మొత్తం మరణాలు:4,24,351
- కోలుకున్నవారు:3,08,20,521
- యాక్టివ్ కేసులు:4,10,952
వ్యాక్సినేషన్:
దేశంలో ఇప్పటివరకు 47,02,98,596 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 60,15,842 డోసులు అందించినట్లు తెలిపింది.