భారత్‌లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 40,120 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 585 మంది మరణించారు. కొత్తగా 42,295 మంది కరోనాను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 97.45 శాతానికి చేరగా.. క్రియాశీలక కేసులు 1.21శాతానికి తగ్గాయి.
మొత్తం కేసులు:3,21,17,826
మొత్తం మరణాలు: 4,30,254
కోలుకున్నవారు:3,13,02,345
యాక్టివ్ కేసులు: 3,85,227
కొవిడ్ పరీక్షలు
మంగళవారం ఒక్కరోజే దేశంలో 19,70,495 కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 48,94,70,779 కు చేరింది.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
- మహారాష్ట్రలో కొత్తగా 6,388 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 208 మంది ప్రాణాలు కోల్పోయారు.
- తమిళనాడులో 1,942 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి 28 మంది బలయ్యారు.
- కర్ణాటకలో ఒక్కరోజే 1,857 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 30 మంది వైరస్ కారణంగా మృతి చెందారు.
- మణిపుర్లో కొత్తగా 677 మందికి వైరస్ సోకింది. కొవిడ్ కారణంగా మరో 12 మంది మరణించారు.
- మధ్యప్రదేశ్‌లో 131 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి కొత్తగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 43 మందికి కరోనా సోకినట్లు తేలింది. కొవిడ్ కారణంగా నలుగురు మరణించారు.
- రాజస్థాన్‌లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:'దేశంలో 50% కేసులు ఆ రాష్ట్రంలోనే.. బూస్టర్ డోసులు కష్టం'