INDIA COVID CASES: భారత్లో కరోనా కలవరం కొనసాగుతోంది. స్వల్పంగా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 3,545 కేసులు నమోదయ్యాయి. మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 3,549 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోలుకున్నవారి శాతం 98.74గా ఉంది. మొత్తం కొవిడ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 0.05 శాతంగా ఉన్నాయి.
- మొత్తం కరోనా కేసులు:4,30,94,938
- మొత్తం మరణాలు:5,24,002
- యాక్టివ్ కేసులు: 19,688
- కోలుకున్నవారి సంఖ్య: 4,25,51,248
వ్యాక్సిన్ తీసుకునేందుకు పెద్దఎత్తున జనం ముందుకొస్తున్నారు. గురువారం ఒక్కరోజే 16,59,843 మందికి టీకా అందించింది కేంద్రం. మొత్తంగా ఇప్పటివరకు 1,89,81,52,695 డోసుల టీకా పంపిణీ చేసింది. గురువారం 4,65,918 మందికి కరోనా పరీక్షలు చేపట్టింది. ఇప్పటివరకు చేసిన టెస్టుల సంఖ్య 83.97 కోట్లు దాటింది.