భారత్లో రోజువారీ కొవిడ్ కేసులు మళ్లీ పెరిగాయి. తాజాగా 35,178 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 440 మంది మరణించారు. కొత్తగా 37,169 మంది కరోనాను జయించారు.
- మొత్తం కేసులు:3,22,85,857
- మొత్తం మరణాలు: 4,32,519
- కోలుకున్నవారు:3,14,85,923
- యాక్టివ్ కేసులు: 3,67,415
కొవిడ్ పరీక్షలు
మంగళవారం ఒక్కరోజే దేశంలో 17,97,559 కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 49,84,27,083కు చేరింది.
వ్యాక్సినేషన్..
దేశంలో ఇప్పటివరకు 56,06,52,030 వ్యాక్సిన్ డోసులు అందించారు. మంగళవారం ఒక్కరోజే 55,05,075 డోసులు పంపిణీ చేశారు.
ప్రపంచంలో కొవిడ్ కేసులు..
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 6,46,112 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ ధాటికి మరో 9,920 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 20,93,40,315కి చేరగా.. మరణాల సంఖ్య 43,93,492కు పెరిగింది.
కొత్త కేసులు..
- అమెరికా- 1,37,307
- బ్రెజిల్- 38,218
- ఫ్రాన్స్- 28,114
- బ్రిటన్- 26,852
- రష్యా- 20,958
ఇదీ చదవండి:కేరళలో కొవిడ్ ఉద్ధృతి- కొత్తగా 21 వేల కేసులు