భారత్లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య (Coronavirus India) స్వల్పంగా తగ్గింది. కొత్తగా 34,457 మంది వైరస్ బారినపడ్డారు. మరో 375 మంది మరణించారు. ఒక్కరోజే 36,347 మంది కరోనాను జయించారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,61,340గా ఉంది. 151 రోజుల తర్వాత ఇదే అత్యల్పం.
- మొత్తం కేసులు: 3,23,93,286
- మొత్తం మరణాలు: 4,33,964
- మొత్తం కోలుకున్నవారు:3,15,97,982
- యాక్టివ్ కేసులు:3,61,340
వ్యాక్సినేషన్..
దేశంలో శుక్రవారం 17,21,205 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 50,44,20,907కు చేరింది. ఒక్కరోజే 36,36,043 వ్యాక్సిన్లు అందించగా.. ఇప్పటివరకు మొత్తంగా 57,61,17,350 టీకా డోసులు పంపిణీ చేశారు.
ప్రపంచంలో కొవిడ్ కేసులు..