Covid cases latest: దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య.. మంగళవారంతో పోలిస్తే పెరిగాయి. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా.. 3,205 పాజిటివ్‌లు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ కేసులతో దేశంలో యాక్టివ్ కేసులు 19,509గా ఉన్నాయి. మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,802 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా నమోదైంది. వ్యాక్సినేషన్‌లో భాగంగా.. ఇప్పటివరకు 189 కోట్ల 48 లక్షల కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
- యాక్టివ్ కేసులు: 19,509
- మొత్తం మరణాలు:5,23,920
- రికవరీలు:4,25,44,689
- మొత్తం కేసులు: 4,30,88,118
Covid cases around the world: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 5,94,272 మందికి వైరస్ సోకినట్లు తేలింది. 1,827 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జర్మనీలో 1,58,213 కేసులు వెలుగుచూశాయి. 236 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఫాన్స్‌లో తాజాగా 67,017 కేసులు నమోదయ్యాయి. 120 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో కొత్తగా 62,071 కేసులు బయటపడ్డాయి. మహమ్మారితో 153 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 52,573 కేసులు నమోదయ్యాయి. 340 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 51,020 కేసులు వెలుగుచూశాయి. 49 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:'మసీదులపై అవి తీసేయాల్సిందే'.. కేసు పెట్టినా వెనక్కితగ్గని ఠాక్రే