భారత్లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య (Corona virus India) స్వల్పంగా తగ్గింది. కొత్తగా 30,948 మంది వైరస్(Corona virus) బారినపడ్డారు. మరో 403 మంది మరణించారు. ఒక్కరోజే 38,487 మంది కరోనాను జయించారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,53,398 గా ఉంది.
- మొత్తం కేసులు:3,24,24,234
- మొత్తం మరణాలు:4,34,367
- మొత్తం కోలుకున్నవారు:3,16,36,469
- క్రియాశీల కేసులు:3,53,398
వ్యాక్సినేషన్..
దేశంలో శనివారం 15,85,681 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 50,60,06,588కు చేరింది. ఒక్కరోజే 52,23,612 వ్యాక్సిన్లు అందించగా.. ఇప్పటివరకు మొత్తంగా 58,14,89,377 టీకా డోసులు పంపిణీ చేశారు.
తగ్గిన క్రియాశీల కేసులు..
దేశంలో క్రియాశీల కేసులు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 3,53,398 కేసులు ఉన్నాయి. 152 రోజుల్లో ఇవే అత్యల్పం. మొత్తం కొవిడ్ బాధితుల్లో ఇవి 1.09శాతం. మరోవైపు రికవరీ రేటు 97.57 శాతానికి పెరిగింది. గతేడాది మార్చి నుంచి చూస్తే.. ఇదే అత్యధికమని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. రోజూవారీ పాజిటివిటీ రేటు 1.95 శాతంగా ఉంది. మరణాల రేటు 1.34శాతంగా కొనసాగుతుంది.