భారత్లో కరోనా కేసులు (Coronacases in India) మళ్లీ భారీగా తగ్గాయి. కొత్తగా 30941 మంది వైరస్(Covid-19) బారినపడ్డారు. మరో 350 మంది మరణించారు. 36,275 మంది కరోనాను జయించారు. ఆగస్టు 25 నుంచి వరుసగా ఐదు రోజులు 40 వేలకుపైగా కేసులు నమోదవటం గమనార్హం. మళ్లీ ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.
దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 97.53గా ఉంది.
- మొత్తం కేసులు: 3,27,68,880
- మొత్తం మరణాలు: 4,38,560
- మొత్తం కోలుకున్నవారు: 3,19,59,680
- యాక్టివ్ కేసులు: 3,70,640
వ్యాక్సినేషన్
సోమవారం ఒక్కరోజే 59 లక్షలకుపైగా టీకా (Vaccination in India) డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు 64,05,28,644 టీకా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.
కొవిడ్ పరీక్షలు