భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి(Covid in India) క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. కొత్తగా 30,549 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. వైరస్ బారిన పడి మరో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38,887మంది వైరస్ నుంచి కోలుకోగా రికవరీ రేటు 97.38 శాతానికి చేరింది.
- మొత్తం కేసులు:3,17,26,507
- మొత్తం మరణాలు:4,25,195
- కోలుకున్నవారు:3,08,96,354
- యాక్టివ్ కేసులు:4,04,958
వ్యాక్సినేషన్:
దేశంలో ఇప్పటివరకు 47,85,44,114 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 61,09,587 డోసులు అందించినట్లు తెలిపింది.
ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు ఇలా ఉన్నాయి..
- కేరళలో కొత్తగా 13,984 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్‌తో మరో 118 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మహారాష్ట్రలో ఒక్కరోజే 4,869 కరోనా కేసులు నమోదయ్యాయి.90 మంది ప్రాణాలు కోల్పోయారు.
- తమిళనాడులో కొత్తగా 1,957 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్ ధాటికి మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో ఒక్కరోజే 1,285 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 25 మంది చనిపోయారు.
- ఒడిశాలో కొత్తగా 1,032 మందికి వైరస్ సోకింది. కొవిడ్ కారణంగా మరో 97 మంది మరణించారు.
ఇదీ చూడండి:కేరళలో తగ్గిన కరోనా ఉద్ధృతి - కొత్తగా 13,984 కేసులు