భారత్లో కరోనా కేసులు(Coronavirus update) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 29,616 మంది కొవిడ్ (Covid cases in India) బారినపడ్డారు. మరో 290 మంది మృతిచెందారు. ఒక్కరోజే 28,046 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 3,36,21,419
- మొత్తం మరణాలు:4,46,658
- మొత్తం కోలుకున్నవారు: 3,28,76,319
- యాక్టివ్ కేసులు:3,01,442
టీకాల పంపిణీ..
దేశంలో ఇప్పటివరకు 84,89,29,160 టీకా డోసులను(covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. శుక్రవారం ఒక్కరోజే 71,04,051 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది.