తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు - కరోనా లేటెస్ట్​ న్యూస్

భారత్​లో కొవిడ్ కేసుల సంఖ్య (Coronavirus update) మళ్లీ పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 26,964 మందికి వైరస్​​ (Covid cases in India) సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 383 మంది మరణించారు. ఒక్కరోజే 34,167 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Corona cases in India
దేశంలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

By

Published : Sep 22, 2021, 9:48 AM IST

Updated : Sep 22, 2021, 2:35 PM IST

దేశంలో రోజువారీ కరోనా​ కేసుల సంఖ్యలో (Coronavirus update) మళ్లీ పెరుగుదల నమోదైంది. కొత్తగా 26,964 మంది​కి కొవిడ్​​​ (Covid cases in India) పాజిటివ్​గా తేలింది. మరో 383 మంది మృతిచెందారు. మంగళవారం ఒక్కరోజే 34,167 మంది కరోనాను జయించారు.

⦁ మొత్తం కేసులు: 3,35,31,498‬

⦁ మొత్తం మరణాలు: 4,45,768

⦁ మొత్తం కోలుకున్నవారు: 3,27,83,741

⦁ యాక్టివ్ కేసులు: 3,09,575

పరీక్షలు

మంగళవారం ఒక్కరోజే 15,92,395 కరోనా టెస్టులు(Testing update for covid-19) నిర్వహించారు. దీంతో మొత్తం కొవిడ్​ పరీక్షల సంఖ్య 55,66,28,112‬ కు చేరింది.

టీకాల పంపిణీ..

దేశంలో ఇప్పటివరకు 82,65,15,754 టీకా డోసులను(covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మంగళవారం ఒక్కరోజే 75,57,529 వ్యాక్సిన్​ డోసులను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది.

ప్రపంచ దేశాల్లో..

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య (Global corona virus update) మళ్లీ పెరిగింది. కొత్తగా 4,57,517 మందికి వైరస్​(Corona update) బారినపడ్డారు. కొవిడ్​ ధాటికి మరో 8,223 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,02,80,392 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 47,21,686కు పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికా - 120,579
  • రష్యా - 19,179
  • బ్రిటన్ - 31,564
  • టర్కీ - 29,338
  • ఇరాన్ - 17,564

ఇదీ చూడండి :'ఆర్' వ్యాల్యూతో ఊరట.. తగ్గుతున్న కరోనా కేసులు!

Last Updated : Sep 22, 2021, 2:35 PM IST

ABOUT THE AUTHOR

...view details