Corona cases in India: భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే.. 2,68,833 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 402 మంది మరణించారు. 1,22,684 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం మరణాలు:48,57,52
- యాక్టివ్ కేసులు:14,17,820
- మొత్తం కోలుకున్నవారు:34,94,7,390
Omicron Cases In India
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6,041కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Vaccination in India
భారత్‌లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 58,02,976 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,56,02,51,117కు చేరింది.
అంతర్జాతీయంగా..
corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 31,71,780 మందికి కరోనా సోకింది. 7,629 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 32,42,68,862కి చేరగా.. మరణాలు 55,46,837కు పెరిగింది.
- అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 8,05,620మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 2,140 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 6.6 కోట్లు దాటింది.
- ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 3,29,371 కేసులు వెలుగుచూశాయి. మరో 191 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లో మరో 99,652 మంది వైరస్ బారిన పడ్డారు. 270 మంది మృతి చెందారు.
- ఇటలీలో 1,86,253 కొత్త కేసులు బయటపడగా.. 360 మంది మరణించారు.
- స్పెయిన్‌లో 1,62,508 మందికి కొత్తగా వైరస్ సోకింది. మరో 139 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:వ్యాక్సినేషన్లో దూసుకెళ్తున్న దేశాలు.. భారత్ ఎన్నో స్థానమంటే?
దేశంలో ఆగని కరోనా ఉద్ధృతి.. మరో 2.64 లక్షల మందికి వైరస్