భారత్లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య (Corona virus India) స్వల్పంగా తగ్గింది. కొత్తగా 25,467 మంది వైరస్(Corona virus) బారినపడ్డారు. మరో 354 మంది మరణించారు. ఒక్కరోజే 39,486 మంది కరోనాను జయించారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,19,551గా ఉంది.
- మొత్తం కేసులు:3,24,74,773
- మొత్తం మరణాలు:4,35,110
- కోలుకున్నవారు:3,17,20,112
- యాక్టివ్ కేసులు:3,19,551
వ్యాక్సినేషన్
ఒక్కరోజే 63,85,298 వ్యాక్సిన్లు అందించగా.. ఇప్పటివరకు మొత్తంగా 58,89,97,805 టీకా డోసులు పంపిణీ చేశారు.
కొవిడ్ పరీక్షలు
సోమవారం ఒక్కరోజే దేశంలో 16,47,526 కొవిడ్ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 50,91,98,925కి చేరినట్లు చెప్పింది.
పెరిగిన రికవరీ రేటు..
- ప్రస్తుతం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.68గా ఉంది.
- 2020, మార్చి నుంచి ఇదే అత్యధికం.
- క్రియాశీల కేసుల రేటు 0.98 శాతానికి తగ్గింది.
- గడచిన 156 రోజుల్లో ఇవే అత్యల్పం.
- దేశంలో రోజువారి పాజిటివిటీ రేటు 1.94 శాతంగా ఉంది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.90గా ఉంది.