దేశంలో కరోనా కేసులు (India covid cases) క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా 25 వేల కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 339 మంది మరణించారు. 37,127 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 3,32,89,579
- మొత్తం మరణాలు: 4,43,213
- యాక్టివ్ కేసులు: 3,62,207
- కోలుకున్నవారు: 3,24,84,159
వ్యాక్సినేషన్
దేశంలో టీకా పంపిణీ (Vaccination in India) రికార్డు వేగంతో కొనసాగుతోంది. మొత్తం 75,22,38,324 డోసులు పంపిణీ చేశారు. సోమవారం 78,66,950 మందికి టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తన పోర్టల్లో వెల్లడించింది.
ఇదీ చదవండి:దేశంలో 75 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ