భారత్లో రోజువారీగా నమోదవుతున్న కొవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 25,166 మంది వైరస్ బారినపడ్డారు. గడిచిన 154 రోజుల్లో ఇవే అతితక్కువ. మరో 437 మంది మరణించారు. కొత్తగా 36,830 మంది కరోనాను జయించారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.51 శాతంగా ఉంది.
వ్యాక్సినేషన్..
దేశంలో సోమవారం 15,63,985 కరోనా పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 88,13,919 వ్యాక్సిన్లు పంపిణీ చేయగా.. ఇప్పటివరకు మొత్తంగా 55,47,30,609 టీకా డోసులు పంపిణీ చేశారు.
- మొత్తం కేసులు : 3,22,50,679
- యాక్టివ్ కేసులు : 3,69,846
- కోలుకున్నవారు: 3,14,48,754
- మరణాలు : 4,32,079
రికార్డు స్థాయిలో రికవరీ రేటు..
జాతీయ రికవరీ రేటు ప్రస్తుతం 97.51 శాతంగా ఉంది. 2020, మార్చి నుంచి చూస్తే.. ఇదే అత్యధికం. రోజూవారీ పాజిటివిటీ రేటు 1.15శాతంగా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 146 రోజుల కనిష్ఠ స్థాయికి వెళ్లాయి.