Corona Cases In India: దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే స్వల్పంగా పెరిగింది. మరో 2,451 మందికి పాజిటివ్‌గా తేలింది. వైరస్ కారణంగా కొత్తగా 54 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,589 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 52వేల పైకి చేరింది. మరణాల సంఖ్య 5లక్షల 22వేలకు పైగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.5 శాతానికి పైగా ఉంది.
- యాక్టివ్ కేసులు: 14,241
- మొత్తం మరణాలు: 5,22,116
- మొత్తం కేసులు: 4,30,52,481
- రికవరీలు: 4,25,16,068
Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. గురువారం 18,03,558 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,87,26,26,515కు చేరింది. మరో 4,48,939 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి . ఒక్కరోజు వ్యవధిలో 8,10,560 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 3,289 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- జర్మనీలో 139,849 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 390 మంది మృతిచెందారు.
- ఫ్రాన్స్‌లో తాజాగా 104,007 మంది వైరస్ సోకింది. మరో 185 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియాలో తాజాగా 90,825 కరోనా కేసులు నమోదయ్యాయి. 147 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇటలీలో 75,020 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 166 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఆస్ట్రేలియాలో 54,558 కరోనా కేసులు బయటపడ్డాయి. 50 మంది వైరస్‌కు బలయ్యారు.
ఇదీ చదవండి:షరతుల్లేకుండా కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిశోర్- జగన్‌తో పొత్తుకు వ్యూహం!