తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు, మరణాలు - corona news

Covid Cases In India: దేశంలో కొత్తగా 2,183 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా మరో 214 మంది చనిపోయారు.

india corona cases
india corona cases

By

Published : Apr 18, 2022, 9:48 AM IST

Covid Cases In India: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదివారం 1,150 మందికి వైరస్ సోకగా.. సోమవారం ఆ సంఖ్య 2,183కి చేరింది. క్రితం రోజుతో పోల్చితే కొత్త కేసులు దాదాపు రెట్టింపు అయ్యాయి. వైరస్ కారణంగా మరో 214 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 4,30,44,280కు చేరగాా.. మరణాల సంఖ్య 5 లక్షల 22వేలకు సమీపించింది. యాక్టివ్ కేసులు 11,500కుపైగా ఉన్నాయి.

  • యాక్టివ్ కేసులు: 11,542
  • మరణాలు: 5,21,965
  • మొత్తం కేసులు: 4,30,44,280
  • రికవరీలు: 4,25,10,773

Vaccination in India: దేశంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. ఆదివారం 2,66,459 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,86,54,94,355కు చేరింది. మరో 2,61,440 కరోనా టెస్టులు నిర్వహించారు. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా 452,803 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి ధాటికి 1,185 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్​ దేశాల్లో కొవిడ్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • దక్షిణ కొరియాలో తాజాగా 93,001 కరోనా కేసులు నమోదయ్యాయి. 203 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఫ్రాన్స్​​లో తాజాగా 86,650 మంది వైరస్​ సోకింది. మరో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో 26,716 కొవిడ్​ కేసులు వెలుగుచూశాయి. 14 మంది మృతిచెందారు.
  • ఆస్ట్రేలియాలో 33,193 కరోనా కేసులు బయటపడ్డాయి. 15 మంది వైరస్​కు బలయ్యారు.
  • ఇటలీలో 51,993 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 85 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి:గుజరాత్​లో మోదీ మూడు రోజుల పర్యటన.. డబ్లూహెచ్​ఓ కేంద్రం గర్వకారణమని ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details