తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid cases in India: దేశంలో మరో 16,862 మందికి కరోనా - దేశంలో కరోనా పరీక్షలు

భారత్​లో ఒక్కరోజే 16,862 మంది​కి (Covid cases in India) వైరస్​ సోకింది. మరో 379 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19,391 మంది కరోనాను జయించారు.

corona cases in india
భారత్​లో కరోనా కేసులు

By

Published : Oct 15, 2021, 10:12 AM IST

దేశంలో కరోనా(Coronavirus update) కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా 16,862 మంది​కి కరోనా (Coronavirus update) పాజిటివ్​గా తేలింది. కొవిడ్​ ధాటికి(Covid cases in India) మరో 379 మంది మరణించారు. ఒక్కరోజే 19,391 మంది రికవరీ అయ్యారు.

  • మొత్తం కేసులు:3,40,37,592
  • మొత్తం మరణాలు:2,03,678
  • మొత్తం కోలుకున్నవారు:3,33,82,100
  • యాక్టివ్ కేసులు:4,51,814

పరీక్షలు

అక్టోబరు 14న 11,80,148 కరోనా​ పరీక్షలు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 58,88,44,673కు చేరింది.

టీకాల పంపిణీ

గురువారం ఒక్కరోజే 30,26,483 కొవిడ్​ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 97,14,38,553కు చేరినట్లు చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 4,42,003 మందికి వైరస్ ​(Corona update) సోకింది. కొవిడ్​​ ధాటికి మరో 7,421 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,03,83,902కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 48,96,745కు పెరిగింది.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 89,680 మందికి వైరస్​ సోకింది. మరో 1,654 మంది వైరస్​​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో క్రితం రోజుతో పోల్చుకుంటే కొవిడ్​ కేసుల్లో కాస్త పెరిగాయి. కొత్తగా 45,066 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. అయితే మరణాల సంఖ్య తగ్గింది. తాజాగా 157 మృతి చెందారు.
  • టర్కీలో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. ఒక్కరోజే 30,709 మందికి వైరస్​ బారిన పడగా.. 203 మంది మరణించారు.
  • రష్యాలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. తాాజాగా 31,299 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజే 986 మంది వైరస్​ ధాటికి మృతి చెందారు.
  • ఇరాన్​లో కొత్తగా 11,964 మందికి కొవిడ్​ సోకగా.. 223 మంది చనిపోయారు.
  • బ్రెజిల్​లో తాజాగా 14,288 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 558 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:బడి చదువులపై కరోనా పంజా

ABOUT THE AUTHOR

...view details