దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 16,505 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 1 కోటి 3లక్షల 40వేల 470కు పెరిగింది. వైరస్ ధాటికి మరో 214 మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 1లక్షా 49వేల 649కి చేరింది.
రికవరీ రేటు ఇలా..

తాజాగా 19వేల మందికిపైగా వైరస్ నుంచి కోలుకున్నారు. ఫలితంగా కరోనాను జయించిన వారి సంఖ్య 99లక్షల 46వేల 867కి చేరింది. 2లక్షల 43వేల 953 యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 96.16 శాతానికి ఎగబాకింది. మరణాల రేటు స్థిరంగా 1.45 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 7లక్షల 35వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఫలితంగా మొత్తం టెస్ట్‌ల సంఖ్య 17కోట్ల 56లక్షలు దాటాయి.