దిగొచ్చిన కరోనా కేసులు- కొత్తగా 15 వేల మందికి వైరస్
దేశంలో మరో 15,981 మందికి (Covid cases in India) కరోనా పాజిటివ్‌గా తేలింది. కొత్తగా 166 మంది మృతి చెందగా.. 17,861 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
కరోనా కేసులు
By
Published : Oct 16, 2021, 9:54 AM IST
|
Updated : Oct 16, 2021, 3:14 PM IST
భారత్‌లో కరోనా(Coronavirus update) కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 15,981 మందికి కరోనా (Coronavirus update) సోకింది. కొవిడ్ ధాటికి(Covid cases in India) మరో 166 మంది మరణించారు. ఒక్కరోజే 17,861 మంది వైరస్‌ను జయించారు.
మొత్తం కేసులు: 3,40,53,573
మొత్తం మరణాలు: 4,51,980
మొత్తం కోలుకున్నవారు: 3,33,99,961
యాక్టివ్ కేసులు: 2,01,632
టెస్టులు
అక్టోబరు 15న 9,23,003 కరోనా టెస్టులు (Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. ఫలితంగా మొత్తం పరీక్షల సంఖ్య 58,98,35,258కి చేరింది.
టీకాల పంపిణీ
శుక్రవారం ఒక్కరోజే 8,36,118 కొవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 97,23,77,045కు చేరినట్లు చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య (coronavirus worldwide) శుక్రవారం స్వల్పంగా తగ్గింది. కొత్తగా 4,36,859 మంది వైరస్ (Corona update) బారిన పడ్డారు. కొవిడ్ ధాటికి మరో 6,970 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,08,34,293కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,04,774కు పెరిగింది.