తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid Cases In India: దేశంలో మరో 14,862 మందికి కరోనా - కొవిడ్​ వ్యాక్సినేషన్

భారత్​లో కొత్తగా మరో 14,862 కరోనా కేసులు (Covid cases in India) నమోదయ్యాయి. 197మంది ప్రాణాలు కోల్పోగా.. 19,446 మంది వైరస్​ను జయించారు.

కరోనా వైరస్
Covid cases in India: దేశంలో మరో 14,862 మందికి కరోనా

By

Published : Oct 20, 2021, 9:31 AM IST

దేశంలో కరోనా(Coronavirus update) కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 14,862 మంది​కి కరోనా (Coronavirus update) సోకగా.. మహమ్మారి ధాటికి(Covid cases in India) మరో 197 మంది ప్రాణాలు కోల్పోయారు. 19,446 మంది రికవరీ అయ్యారు.

  • మొత్తం కేసులు: 34,109,235‬
  • మొత్తం మరణాలు: 4,52,651
  • మొత్తం కోలుకున్నవారు: 3,34,78,247
  • యాక్టివ్ కేసులు: 1,78,098

పరీక్షలు

మంగళవారం ఒక్కరోజే 13,23,702 కరోనా​ పరీక్షలు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది.

టీకాల పంపిణీ..

కొత్తగా 41,36,142 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 99,12,82,283 కు చేరినట్లు వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ (coronavirus worldwide) కొనసాగుతోంది. కొత్తగా 3,42,986 మందికి వైరస్ ​(Corona update) సోకింది. కొవిడ్​​ ధాటికి మరో 4,921 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,18,70,992 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,20,294 కు పెరిగింది.

  • అమెరికాలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 71,809 మందికి వైరస్​ సోకింది. మరో 1,563 మంది వైరస్​​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
  • రష్యాలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. తాజాగా 33,740 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజే 1,015 మంది వైరస్​ ధాటికి మృతి చెందారు.
  • బ్రిటన్​లో క్రితం రోజుతో పోల్చుకుంటే కొవిడ్​ కేసులు కాస్త పెరిగాయి. కొత్తగా 43,738 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. 223 మృతి చెందారు.
  • టర్కీలో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. ఒక్కరోజే 30,862 మందికి వైరస్​ బారిన పడగా.. 223 మంది మరణించారు.
  • బ్రెజిల్​లో తాజాగా 12,969 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 381 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి :'ఆర్ వ్యాల్యూ' ఒకటి లోపే- కరోనా కంట్రోల్ అయినట్టేనా?

ABOUT THE AUTHOR

...view details