దేశంలో రోజువారి కరోనా కేసులు కాస్త తగ్గాయి (Coronavirus update). కొత్తగా 14,313 కరోనా కేసులు (Coronavirus update) వెలుగు చూశాయి. వైరస్ ధాటికి (Covid cases in India) మరో 549 మంది ప్రాణాలు కోల్పోగా.. 13,543 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 3,41,15,070
- మొత్తం మరణాలు: 4,57,740
- మొత్తం కోలుకున్నవారు: 3,36,41,175
- యాక్టివ్ కేసులు: 1,61,555
పరీక్షలు
దేశవ్యాప్తంగా గురువారం 11,76,850 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య 60,69,59,807కు చేరినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
టీకా పంపిణీ
టీకా పంపిణీ కొత్తగా 56,91,175 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,05,43,13,977 కి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు..
ప్రపంచవ్యాప్తంగా (coronavirus worldwide) కొత్తగా 4,67,944 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ ధాటికి మరో 7,581 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2,467,26,278 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 50,03,934కు పెరిగింది.
- అమెరికాలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 80,469 మందికి వైరస్ సోకగా.. మరో 1,556 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బ్రిటన్‌లో కొత్తగా 43,467 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 186 మంది మృతి చెందారు.
- రష్యాలో కొత్తగా 39,849 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజే 1,163 మంది చనిపోయారు.
- ఉక్రెయిన్‌లో కొత్తగా 26,870 మందిలో వైరస్ నిర్ధరణ అయ్యింది. 648 మంది వైరస్ కారణంగా చనిపోయారు.
- టర్కీలో కొత్తగా 24,409 మంది వైరస్ బారిన పడగా.. 209 మంది మరణించారు.
- జర్మనీలో కొత్తగా మరో 23,758 మందికి కొవిడ్ సోకింది. 114 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి:రష్యాలో కరోనా మరణమృదంగం..రెండో రోజూ రికార్డు మరణాలు