దేశంలో రోజువారి కరోనా కేసులు (Coronavirus update) స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 14,306 కరోనా కేసులు (Coronavirus update) నమోదయ్యాయి. వైరస్ ధాటికి (Covid cases in India) మరో 443 మంది ప్రాణాలు కోల్పోగా.. 18,762 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 3,41,90,013
- మొత్తం మరణాలు: 4,54,712
- మొత్తం కోలుకున్నవారు: 3,35,67,367
- యాక్టివ్ కేసులు: 1,67,695
టీకా పంపిణీ
కొత్తగా 12,30,720 టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,02,27,12,895కి పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా (coronavirus worldwide) కొత్తగా 3,74,274 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ ధాటికి మరో 5,735 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 24,41,09,329కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 49,59,193కు పెరిగింది.
- అమెరికాలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 17,580 మందికి వైరస్ సోకగా.. మరో 157 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో కొత్తగా 35,660 మందికి వైరస్ సోకింది. ఒక్కరోజే 1,072 మంది చనిపోయారు.
- బ్రిటన్‌లో కొత్తగా 39,962 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. 72 మంది మృతి చెందారు.
- టర్కీలో కొత్తగా 24,792 మంది వైరస్ బారిన పడగా.. 195 మంది మరణించారు.
- బ్రెజిల్లో కొత్తగా మరో 6,204 మందికి కొవిడ్ సోకింది. 113 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి :Covid Festive Season: 'పండగలు వస్తున్నాయి.. జాగ్రత్త సుమీ!'