తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా 13వేల మందికి పాజిటివ్​ - కరోనా న్యూస్​

Covid cases in india: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 13,405 కేసులు నమోదయ్యాయి. 34,226 మంది కోలుకున్నారు. 235 మంది మరణించారు.

corona cases
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

By

Published : Feb 22, 2022, 9:25 AM IST

Corona cases: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కేసుల సంఖ్య 14వేల లోపునకు పడిపోయింది. కొత్తగా 13,405 కేసులు నమోదయ్యాయి. 24గంటల వ్యవధిలో 235 మంది మరణించారు. 34,226 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.24శాతానికి పరిమితమైంది.

  • మొత్తం కేసులు: 4,28,51,929
  • మొత్తం మరణాలు: 5,12,344
  • యాక్టివ్ కేసులు: 1,81,075
  • మొత్తం కోలుకున్నవారు: 4,21,58,510

Vaccination in India:

దేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,75,83,27,441కు చేరింది.

World Covid cases:

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఆందోళకరంగానే ఉంది. 24 గంటల వ్యవధిలో 12,48,450 కేసులు బయటపడ్డాయి. రష్యా, జర్మనీ, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.

  • రష్యాలో తాజాగా 1,52,337 కరోనా కేసులు నమోదయ్యాయి. 735 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో 1,11,824 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 149 మంది కరోనాకు బలయ్యారు.
  • బ్రెజిల్​లో రోజువారీ కరోనా మరణాలు సంఖ్య భారీగా ఉంటోంది. 24 గంటల వ్యవధిలో 333 మంది చనిపోయారు. కొత్తగా 42,379 కేసులు వెలుగుచూశాయి.

ఇదీ చదవండి:భార్యను కొట్టి, నోట్లో వస్త్రం కుక్కి సెక్స్​- కోర్టు ఏం చేసిందంటే?

ABOUT THE AUTHOR

...view details